How to improve bike mileage : మీ బైక్​ మైలేజ్​ పెంచుకోవాలంటే.. ఈ టిప్స్​ పాటించండి!

Sathish Pendyala | 17 Views | 2024-03-31T18:25:33+00:00

via : Hindustantimes
Original Author : Sharath Chitturi

How to get better mileage : ఇప్పుడంటే.. పెట్రోల్​, డీజిల్​ ధరలు కాస్త తగ్గాయి కానీ.. గత కొన్నేళ్లుగా చూసుకుంటే మాత్రం.. మన జేబులకు ఎంత చిల్లుపడుతోందో అర్థమైపోతుంది. ఇంధన ధరలు మాటిమాటికి పెరుగుతూనే ఉంటాయి. ఇది వాహనదారులకు ఇబ్బంది కలిగించే విషయం. అందుకే.. చాలా మంది మైలేజ్​పై ఫోకస్​ చేస్తారు! మంచి మైలేజ్​ ఇచ్చే బైక్​ని కొనాలని చూస్తుంటారు. కానీ కొంతకాలానికి.. బైక్​ మైలేజ్​ పడిపోతుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. మరి ఆ సమయంలో ఏం చేయాలి? ఏ టిప్స్​ పాటిస్తే.. బైక్​ మైలేజ్​ని మెరుగుపర్చుకోవచ్చు? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము…

కార్బ్యురేటర్​ని రిట్యూన్​ చేయండి..

మోటార్ సైకిల్ మైలేజీని మెరుగుపరచడానికి కార్బ్యురేటర్ రీట్యూనింగ్ చాలా ముఖ్యం. ఒకవేళ మీరు మీ బైక్​ నుంచి తగినంత మైలేజీని పొందకపోతే, కార్బ్యురేటర్ సెట్టింగ్​లను తనిఖీ చేయండి. దీనిని ఎలక్ట్రికల్​గా లేదా మాన్యువల్ గా రీట్యూన్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంజిన్ పని సామర్థ్యం పెరుగుతుంది, మైలేజ్ గణనీయంగా మెరుగుపడుతుంది. మంచి రిజల్ట్​ చూస్తారు.

ఖాళీగా ఉన్నప్పుడు ఇంధనాన్ని వృథా చేయొద్దు..

Tips to improve bike mileage : ట్రాఫిక్ సిగ్నల్ వద్ద 20 సెకన్ల కంటే ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తే ఇంజిన్​ని ఆఫ్​ చేయడం ఉత్తమం. ఇంజిన్ రన్ అవుతూ ఖాళీగా నిలబడితే.. ఫ్యూయెల్​ కాలిపోతోంది. ముఖ్యంగా నగరాల్లో స్టాప్ అండ్ గో ట్రాఫిక్ పరిస్థితుల్లో చాలా ఫ్యూయెల్​ ఖర్చు అవుతుంది. అందువల్ల, మీరు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఇంజిన్ ఆఫ్ చేయడం ద్వారా, దీర్ఘకాలంలో చాలా ఇంధనాన్ని ఆదా చేయవచ్చు.

టైర్ ప్రెజర్ చెక్ చేయండి..

ఏదైనా వేహికల్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీని పెంచడంలో టైర్ ప్రెజర్ కీలక పాత్ర పోషిస్తుంది. మేన్యుఫ్యాక్చర్​ నిర్దేశించినట్టు.. ఎల్లప్పుడూ టైర్ ప్రెజర్​ని సరైన స్థాయిలో ఉంచండి. మోటార్ సైకిల్​ను లాంగ్ రైడ్ కు తీసుకెళ్లినప్పుడల్లా పెట్రోల్ పంప్ వద్ద టైర్ ప్రెజర్ చెక్ చేసుకోండి. అలాగే, ఇంధనం నింపే స్టేషన్​కి వెళ్లినప్పుడల్లా, టైర్ ప్రెజర్​ని వారానికి ఒకసారైనా తనిఖీ చేయడం మంచిది.

మోటార్ సైకిల్ ను శుభ్రంగా ఉంచుకోండి..

How to improve bike mileage : బైక్​ని శుభ్రంగా, నీట్ కండిషన్​లో ఉంచడం వల్ల దాని నుంచి ఉత్తమ మైలేజ్ పొందొచ్చు. బైక్​ను ఎప్పటికప్పుడు కడిగి శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే, మూవ్​మెంట్​ ఉండ భాగాలను లూబ్రికేషన్ చేయడం మర్చిపోవద్దు.

అనవసరమైన మార్పులను కట్​ చేయండి..

ప్రతి వాహనాన్ని చాలా పరిశోధన తరువాత డిజైన్ చేస్తారు. ఇంజనీర్లు ఏరోడైనమిక్ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాహనాలను డిజైన్ చేస్తారు. ఇది మైలేజ్ ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే బైక్​కి అనవసరమైన మార్పులు చేస్తే.. దానిపై అదనపు బరువు పడుతుంది. ఫలితంగా మైలేజ్​ దెబ్బతినే అవకాశం ఉంటుంది.

పైన చెప్పిన కొన్ని విలువన, ముఖ్యమైన టిప్స్​ పాటించి.. మీరు మీ బైక్​ మైలేజ్​ని పెంచుకోవచ్చు.

WhatsApp channel

Read Full News Here