Nothing Phone 3 : సూపర్​ కూల్​ ఫీచర్స్​తో నథింగ్​ ఫోన్​ 3.. త్వరలోనే లాంచ్​!

Sathish Pendyala | 10 Views | 2024-04-01T17:12:05+00:00

via : Hindustantimes
Original Author : Sharath Chitturi

Nothing Phone 3 leaks : లండన్​కు చెందిన స్మార్ట్​ఫోన్ బ్రాండ్ నథింగ్​.. మిడ్ రేంజ్ గ్యాడ్జెట్​ మార్కెట్లో మంచి క్రేజ్​ సంపాదించుకుంటోంది. కంపెనీ ఇటీవలే తన నాన్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ నథింగ్ ఫోన్ 2ఏని ప్రకటించింది. ఇప్పుడు, రానున్న నెలల్లో తన థర్డ్​ జనరేషన్​ నథింగ్ ఫోన్​ను లాంచ్ చేయనున్నట్లు రూమర్స్​ వెల్లువెత్తుతున్నాయి. నథింగ్ తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా కప్ప- బగ్ తో కూడిన ఓ టీజర్​ను పంచుకుంది. అంతేకాకుండా నథింగ్ ఫోన్ 3 ధర, ఫీచర్స్​కు సంబంధించిన ఫీచర్స్​ ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. ఆ వివరాలను ఇక్కడ చూసేద్దాము..

నథింగ్ ఫోన్ 3 ధర..

91మొబైల్స్ హిందీ నివేదిక ప్రకారం.. కంపెనీ ఫ్లాగ్​షిప్ ప్రాడక్ట్​ అయిన నథింగ్ ఫోన్ 3 జూలైలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనికితోడు కంపెనీకి చెందిన కొత్త టీజర్ ఇంటర్నెట్​లో చక్కర్లు కొడుతోంది. ఇది రాబోయే నథింగ్ ఫోన్ 3 గురించి భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. క్వాల్కమ్​ కొత్తగా లాంచ్ చేసిన స్నాప్​డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్ పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుందని తాజా లీక్ వెల్లడించింది. అంతేకాదు.. ఇందులో అనేక సూపర్​ కూల్​ ఫీచర్స్​ ఉంటాయని తెలుస్తోంది.

Nothing Phone 3 launch date in India : అయితే.. ఈ నథింగ్​ ఫోన్​ 3 గ్యాడ్జెట్​ గురించి చాలా తక్కువ సమాచారం ఉన్నప్పటికీ.. ఇండియాలో దీని ధర రూ.40000 నుంచి రూ.50000 మధ్యలో ఉండవచ్చని టాక్​ నడుస్తోంది. కంపెనీ ప్రస్తుతం తన ప్రత్యేకమైన డిజైన్- ఆఫర్లతో మిడ్-రేంజ్ సెగ్మెంట్​లో కస్టమర్లను ఆకర్షిస్తోంది. కొత్త గ్యాడ్జెట్​ కూడా హిట్​ అవ్వాలని ఆశిస్తోంది.

Nothing Phone 3 price in India : నథింగ్ ఫోన్.. పలు రకాల జంతువుల నుంచి ప్రేరణ పొందుతూ వస్తోంది. ఫస్ట్​ జనరేషన్​ ఫోన్​ని చిలుకతో టీజ్​ చేసింది సంస్థ. నథింగ్ ఫోన్ 2ను ఆక్టోపస్​తో ప్రదర్శించారు. నథింగ్ ఫోన్ 3 టీజర్ లో కప్ప, బగ్ ఉండటం కొత్త తరం స్మార్ట్​ఫోన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు, గ్యాడ్జెట్​ కొనుగోలుదారుల్లో క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది. స్పెసిఫికేషన్లు, డిజైన్, కెమెరా లేదా కొన్ని కొత్త ఏఐ ప్రకటనల పరంగా నథింగ్ ఫోన్ 3లో ఎలాంటి ఫీచర్స్​ ఉంటాయో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వివరాలన్నీ తెలియాలంటే కంపెనీ అఫీషియల్ లాంచ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..

ఇంకో విషయం! హెచ్​టీ తెలుగు ఇప్పుడు వాట్సప్ ఛానల్స్​లో కూడా అందుబాటులో ఉంది. టెక్నాలజీ ప్రపంచం నుంచి ఎటువంటి అప్డేట్స్​ అయినా మీరు మిస్ కాకుండా ఉండటానికి హెచ్​టీ తెలుగును అక్కడ అనుసరించండి.

WhatsApp channel

Read Full News Here